![R Damodar Reddy R Damodar Reddy](http://thatstelugu.oneindia.in/img/2010/01/08-damodar.jpg)
న్యూఢిల్లీ: తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కె. రోశయ్య, ఆయన చిత్రగుప్తుడు వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర భద్రతా సలహాదారు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు పేరెత్తకుండా ఆయన చిత్రగుప్తుడిగా అభివర్ణించారు. తెలంగాణ సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే బస్సు చార్జీలు పెంచారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. తమ ఉద్యమం శాంతియుతంగా సాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ వస్తే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని కొంత మంది నూరిపోశారని ఆయన విమర్శించారు.
No comments:
Post a Comment