Friday, January 8, 2010

నోరు హద్దుల్లో పెట్టుకోండి: విజయశాంతి

 Vijayashanthi

హైదరాబాద్: సమైక్యవాదులు నోరు అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థులపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ విద్యార్థులను తాలిబన్లతో పోల్చడాన్ని ఆమె తప్పు పట్టారు. తమను అలా చిత్రీకరించి రెచ్చగొట్టేందుకు సమైక్యవాదులు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. తమకు ఇప్పటి వరకు ఏ విధమైన మర్యాద ఇవ్వలేదని, తెలంగాణకు ఇచ్చిన హామీలను వేటిని పట్టించుకోలేదని ఆమె అన్నారు.

తెలంగాణ ఇవ్వడం కాంగ్రెసుకు ఇష్టం లేదని, అందుకే చర్చల పేరుతో కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. ఎన్నాళ్లు చర్చలు జరుపుతారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెసు దేనికి కట్టుబడి ఉందో స్పష్టంగా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తారా, ఇవ్వరా తేల్చి చెప్పాలని ఆమె కాంగ్రెసును డిమాండ్ చేశారు. కాంగ్రెసును నమ్మడానికి వీలు లేకుండా పోయిందని, కాంగ్రెసు నాయకులు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే ప్రజలే కాంగ్రెసుకు తగిన బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు.

ప్రస్తుత గందరగోళానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే కారణమని ఆమె విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెసు సాకులు చెప్పడం సరి కాదని, తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తారా లేదా చెప్పాలని ఆమె అన్నారు. తెలంగాణపై శాసనసభలో తీర్మానం అవసరం లేదని విజయశాంతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన విధాన ప్రకటన చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Cartoons